3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి
గోల్డెన్ న్యూస్/ తెలంగాణ :ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్న జనాలు ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చిన్నారులకు దాహం వేయకపోయినా, వీలైనప్పుడల్లా తగినంత మంచినీరు తాగాలి. విద్యార్థులు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తాగునీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మంచి నీటిలో కలుపుకొని తాగవచ్చు. ఇంటి వద్ద ఉన్నప్పుడు నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం పాఠశాల విడిచిన తరువాత బాగా గాలి, చల్లని ప్రదేశాల్లో ఉండాలి. వేడి గాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో విద్యార్థులు, చిన్నారులు పాదరక్షకులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దు. తల్లిదండ్రులు విద్యార్థులకు నిల్వ ఆహార పదార్థాలు పెట్టొద్దు. నిలిపి ఉంచిన వివిధ రకాల వాహనాల్లో చిన్నారులను ఉంచొద్దని వైద్యులు పేర్కొంటున్నారు.రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ నిపుణులు.