నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మక్కా మసీదులో శుక్రవారం  ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉగ్రదాడిపై నిరసనలకు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపుతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనల అనంతరం పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత దూరం ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram