ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తాం: రాహుల్ గాంధీ

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, దీనిపై  భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని.. తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో భేటీ కావడంతోపాటు ఉగ్రదాడి బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram