గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : సస్పెన్షన్లో ఉన్న రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి, భారీగా ఆక్రమాస్తులు గుర్తించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) మొహమ్మద్ గౌస్ పాషా కొంతకాలం క్రితం సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు గౌస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐదుచోట్ల దాడులు నిర్వహించారు.
ఏసీబీ సోదాల్లో రవాణా శాఖాధికారి గౌస్ పాషా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఆయన రెండు ఇళ్లు, 25 ఓపెన్ ప్లాట్లు, 10.36 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు వాహనాలతో పాటు పలు ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.3.51 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు గౌస్ పాషాపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు అధికారులు తెలిపారు
Post Views: 10