గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు.
Post Views: 23