ఉత్తమ సహాయ గాయకురాలిగా చిన్నోళ్ల జయశీల కు అవార్డు

గోల్డెన్ న్యూస్ /మెదక్ : మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్ర నిర్వాహణ క్రమంలో చిన్న పిల్లలను విద్యాపరంగా మరియు ఇతరత్రా పనుల విషయంలో చక్కటి ప్రతిభను కనపరిచినందున చిన్నపిల్లలకు కావలసిన రీతిలో, ఆదరణ, సంరక్షణ పోషణ అందిస్తున్నందుకు ప్రభుత్వం వారు ఉత్తమ సేవ సహాయకురాలిగా అవార్డు మెమొంటోను అందజేసినారు. చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ సహాయకురాలిగా చిన్నోళ్ల జయశీల అధికారుల చేతుల మీదుగా మెమొంటోను అందుకున్నారు, ఇందులో వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram