అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలి.. కలెక్టర్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి చట్టం తదితర సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, భూభారతి చట్టం, జలసంచై జన్ భాగి దారి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు మరియు పాము పౌండ్స్ నిర్మాణం మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారం పై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీ ఎంపిక వేయడం జరిగిందని మిగిలిన గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల అర్హుల జాబితా క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల కు అందజేసి వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీల తో సమన్వయం పరచుకొని ఉన్న జాబితాలో పేదల్లో నిరుపేద వారిని గుర్తించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. జాబితాలో పేరు లేని ఎవరైనా నిరుపేదలు ఉంటే వారి పేర్లు కూడా జత పరిచి అర్హుల జాబితా తయారు చేసి స్థానిక శాసనసభ్యులు సహకారంతో జాబితా రూపొందించాలని అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram