కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.…తోట దేవి ప్రసన్న.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాలను అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులదే
♦ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయకపోయినా చేసింది గోరంత, చెప్పుకున్నది కొండంత
♦ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చెప్పే విషయంలో వెనుకబడిపోయాం అన్నారు.
ప్రజా ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు తప్పించి ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి తీసుకొచ్చినటువంటి పథకాలను, మనము ప్రభుత్వ పాలన గురించి ప్రజాక్షేత్రంలో చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది ఈ విషయాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దివ్య మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా, బ్లాక్, మండల్ టౌన్ అధ్యక్షురాలు కళ్యాణి ఎల్, పొదిలి జ్యోతి, బోడదివ్య, పందాల సరిత, బండ్ల రజిని, గుగులోతు కమలమ్మ, బర్ల నాగమణి, సున్నం లక్ష్మి, బురుగు పద్మశ్రీ , శ్రీలక్ష్మి నాగోలు, గుర్రం సుశీల, జయసుధ, బడుగు కృష్ణవేణి, సౌజన్య కాపర్తి, భూక్య సుగుణ, వసంతల రాజేశ్వరి, ముష్టి శిరీష, దారా సావిత్రి, కోరి విద్య, విజయలక్ష్మి, రాజేశ్వరి వి, పార్వతి, కళ్యాణి వసంతాల, సత్తమ్మ కొమరెల్లి, ధారావత్ చిన్ని తదితరులు పాల్గొన్నారు