నీట్ పరీక్షలో మంచి మార్కులు రావనే భయంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.
గోల్డెన్ న్యూస్/ జగిత్యాల : నీట్లో తక్కువ మార్కులు వస్తాయని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని జగిత్యాల జిల్లా చల్గల్లో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. జంగ రాజేశం-జ్యోతి దంపతుల కుమార్తె పూజ(20) గతేడాది ఇంటర్ పూర్తికాగానే నీట్ రాసింది. ర్యాంకు రాకపోవటంతో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకొని ఆదివారం జరిగిన నీట్‌కు హాజరైంది. సోమవారం కీ విడుదలైంది. మార్కులు తక్కువ వస్తాయని తల్లితో చెప్పి బాధపడింది. కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లి ఉరేసుకొంది. కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి.. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.
అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ నీట్ పరీక్ష బాగా రాయలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Post Views: 26