ఈనెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం నీడ మాయం !

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మిట్ట మధ్యాహ్నం నీడ మాయం. ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ ఆదివారం తెలిపారు.

ప్రతి ఏడాది రెండు సార్లు ఈ రకంగా మన నీడ కనిపించకుండా పోతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది మకర రేఖ, కర్కాటక రేఖ మధ్యలో ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో సూర్యుడి కిరణాలు లంబంగా పడుతాయి. ఆ సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ కనపించకుండా పోతుంది.

 

భూమి వక్షం 23.5 వంపు గా ఉన్నందున సూర్యుడి చుట్టూ భూమి తిరుగు తున్న టైమ్ లో.. సూర్యుడి స్థానం కూడా మారుతుంది. ఆ టైమ్ లోనే ఈ రెండు రేఖల మధ్య సూర్య కిరణాలు లంబంగా పడి మధ్యాహ్న సమయంలో నిలువుగా ఉండే వస్తువుల నీడ రెండు నిముషాల పాటు కనిపించదు. దీన్నే జీరో షాడోగా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని కదలిక, స్థానాన్ని అధ్యయనం చేసేందుకు జీరోషాడో ఎంతగానో ఉపకరిస్తుందని సుసత్యరేఖ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram