ఎస్సీ కులాల అభివృద్దిపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తి వేయాలి

ఎస్సీ కులాల అభివృద్దిపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తి వేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

గోల్డెన్ న్యూస్ / పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జీల్లా పినపాక మండలం షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో పినపాక మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి డిప్యూటీ తాహసిల్దార్ పెనక సమ్మయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కు పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన మాట్లాడారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కులాల అభివృద్ధిపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలన్నారు . ఇల్లు లేని పేదలు భూమిలేని పేదలు భూమి నుండి హక్కులేని పేదలు ఉన్నారు ఏజెన్సీ ప్రాంత ఎస్టీలతో ఎస్సి కులాల అభివృద్ధి సమానంగా ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టాలన్నారు ఎస్సీ రైతుల సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు లేకుండా భూభారతి చట్టం ద్వారా హక్కు పత్రాలు అందజేేసి రైతు భరోసా రైతు బీమా రైతు రుణం అమలు చేయాలని మండల తాసిల్దార్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య పినపాక మండల మాజీ ఎంపీటీసీ సోంపల్లి తిరుపతితి జిల్లా నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు మండల కన్వీనర్ జాడి కిరణ్ నరాల రాజేష్ బసారికారి లక్ష్మి,జాడి నాగలక్ష్మి కొమరం సమ్మక్క మైపా కాంతమ్మ,అనిత తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram