నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ  రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాల మంత్రి పొంగులేటిశ్రీనివాస రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాలలో  పర్యటించనున్నారు.బుధవారం ఉదయం 7:30 గంటలకు పినపాక మండలం గొట్టెల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన. అనంతరం వెంకటాపురం  మండలంలో పర్యటించి మండలకేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం, పాలెం గ్రామం నుంచి గోదావరి నది వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేయన్నట్లు వెంకటాపురం తహసిల్దార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు

Facebook
WhatsApp
Twitter
Telegram