ఏసీబీ వలలో జడ్పీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్

గోల్డెన్ న్యూస్/ ములుగు :  జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యాలయ సూపరింటెండెంట్ గద్దెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య లంచం తీసుకుంటూ మంగళవారం అనిశా అధికారులకు పట్టుబడ్డారు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లుకు సంబంధించి మెడికల్ సెలవుల కోసం చేసిన వేతనం బిల్లు ట్రెజరీ కార్యాలయానికి పంపించేందుకు సూపరింటెండెంట్ రూ.20 వేలు, జూనియర్ అసిస్టెంట్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వీరిద్దరిని విచారించి బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram