పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడి.

ఆపరేషన్ సింధూర్..80 మంది ఉగ్రవాదులు హతం. ?

ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. భారతదేశం చేసిన ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా, లేదా తప్పించుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.

 

మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లు హతమయ్యారా..?

 

బహవల్‌పూర్‌లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా స్వయంగా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మంది జైషే ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

 

ఇది కాకుండా, మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారతదేశం ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణించినట్లు ఎటువంటి సమాచారం రాలేదు.

Facebook
WhatsApp
Twitter
Telegram