ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి గాయాలు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి  యువకుడికి గాయాలయ్యాయి. గొల్లగూడెం గ్రామానికి  చెందిన ఎలబోయిన కళ్యాణ్, నవదీప్ పని నిమిత్తం ఇంటి నుండి ప్రధాన రహదారి వైపు వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కళ్యాణ్ తొడ ఎముక విరిగింది. నవదీప్ కు స్వల్ప గాయాలయ్యాయి.  క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram