గోల్డెన్ న్యూస్ / కూసుమంచి : తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కొత్తూరు వద్ద జరిగింది. గ్రామానికి చెందిన పరిశాబోయిన లక్ష్మయ్య(55) అనే కల్లుగీత కార్మికుడు బుధవారం కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కాడు ప్రమాదవశాత్తు మోకుజారీ కింద పడిపోయాడు అతనికి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
Post Views: 31