గోల్డ్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి కుటుంబాలు, మాజీ సింగరేణి ఉద్యోగుల, సింగరేణి ప్రాజెక్ట్ ప్రభావిత పునరావాస, పరిసర గ్రామాల నిరుద్యోగ యువతకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై నిర్వహించే ఉచిత శిక్షణా కోర్సులకు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, శంషాబాద్, హైదరాబాద్ సహకారంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 08 వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Post Views: 23