పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పినపాక, చర్ల మండలంలో పర్యటించారు. మొదట పినపాక మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పినపాాక మండలంలోని గొట్టెల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కు భూమి పూజా నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆయన వెంట పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ సన్నబియ్యం లబ్దిదారుడైన వాసం ముసలయ్య ఇంట్లో సహా పంక్తి భోజనం చేశారు.అనంతరం లక్ష్మీ కాలనీలో కొత్తగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తేగడలోని ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. మంత్రి వెంట భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీవో రాహుల్, విక్రాంత్ కుమార్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.