లైన్ మార్చడం కోసం రూ.50 వేలు డిమాండ్ .
రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
గోల్డెన్ న్యూస్ /దిండిగల్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రగతి నగర్ విద్యుత్ శాఖ ఏఈ. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్(ఎలీఫ్) సబ్‌స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్.. తన పరిధిలోని మిథిలానగర్‌లో ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ 63 కేవీ లైన్ మార్చేందుకు నెల రోజుల క్రితం కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి రూ.30వేలకు బేరం కుదుర్చుకుని.తర్వాత రూ.15 వేలు తీసుకునేందుకు ఒప్పుకున్న జ్ఞానేశ్వర్ బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రగతినగర్‌లోని ఏఈ కార్యాలయం, నగరంలో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్డులోని ఏఈ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా కార్యాలయం సమీపంలోని కారులోను తనిఖీలు నిర్వహించడం గమనార్హం.