అవినీతికి పాల్పడే వారి సమాచారం ఇవ్వండి

   ఆధారాలతో పట్టిస్తే పారితోషికం 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి వివరాలు అందజేస్తే రూ.10,000 పారితోషికం అందజేస్తామని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే  కార్మికుల సహకారం పూర్తిగా ఉండాలని పేర్కొన్నారు.అమాయకులైన కార్మికులను వంచిస్తున్న ఎవరినైనా సరే సంస్థ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

సంస్థలో అవినీతి నివారణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అవినీతి నిర్మూలన కోసం సమాచారం ఇచ్చిన వారి పేర్లు  గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram