అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా  భద్రాచలం నుంచి అశ్వారావుపేట  మండలానికి మోటార్ సైకిళ్లపై గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను గురువారం అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గురువారం కొంతమంది వ్యక్తులు గంజాయి తరలిస్తునే పక్క సమాచారంతో.వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ద్విచక్ర వాహనాలను  ఆపి తనిఖీ చేయడంతో వారిని పట్టుకున్నట్టు తెలిపారు.

 

నిందితుల వద్ద నుంచి 5 కేజీల గంజాయి, 3 బైకులు, 6 ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram