కొత్త పెన్షన్ లు మంజూరు చేయాలని రాస్తారోకో

గోల్డెన్ న్యూస్ / కామారెడ్డి : ప్రభుత్వం కొత్త పింఛన్లు  మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు రోడ్డెక్కారు. పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు..అనంతరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కయ్య, శంకర్, అశోక్, హన్మాండ్లు, వెంకట్ రావు, లక్ష్మణ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram