తపాలా సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజలకు నెలలు తరబడి అందని లేఖలు,పోస్టల్ బ్యాంకింగ్ సేవలు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమా ?
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలోని తపాలా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని. వీరి నిర్లక్ష్యం వల్ల ప్రజలకు చేయవలసిన లేఖలు నెలల తరబడి చేరడం లేదని. తపాలా కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలు సక్రమంగా నిర్వహించడం లేదని. ఈ నిర్లక్ష్యానికి కారణం ఏమిటో తపాలా అధికారులు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాలను అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. నిత్యం పర్యవేక్షణ లేకపోవడంతో నెలల తరబడి ఉత్తరాలు నిలిచిపోతున్నాయని ఆయన అన్నారు . ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఉత్తరాలు సమయానికి అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఇది ఇలా కొనసాగితే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. మండలంలో ఎన్ని పంచాయితీల్లో తపాలా కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు సమాధానం చెప్పాలని, తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరిపి మండలంలో కొనసాగుతున్న తపాలా సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారన్నారు అధికారులు స్పందించకపోతే ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.