ఆ అవినీతి అధికారిని పట్టించిన సిసి కెమెరాలు

రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

గోల్డ్ న్యూస్ / రాజన్న సిరిసిల్ల :అనిశా అధికారులు వస్తారని ముందు జాగ్రత్తగా తన కుమారుని టీషర్ట్లో లంచం డబ్బులను చుట్టి బయటపడేసి ఏమి తెలియనట్లు నటించారు. రాజన్న సిరిసిల్ల నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. అయినా ఆయన పన్నాగం ఫలించలేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్‌లోని తన నివాసంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ACB అధికారులు

అనిశా అధికారులు వస్తారని ముందు జాగ్రత్తగా తన కుమారుని టీషర్ట్లో లంచం డబ్బులను చుట్టి బయటపడేసి ఏమి తెలియనట్లు నటించారు. రాజన్న సిరిసిల్ల నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. అయినా ఆయన పన్నాగం ఫలించలేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శనివారం కరీంనగర్ అనిశా కోర్టులో అమరేందర్రెడ్డిని హాజరుపరుస్తామని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram