గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : పేదలు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడంతో పేద ప్రజలకు ఇల్లు నిర్మించడం చాలా కష్టంగా మారిందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ అవి సరిపోవని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేదాన్ ఇన్ఫ్రాటెక్ అనే స్టార్టప్ కంపెనీ షేర్ వెల్ టెక్నాలజీని ఉపయోగించుకొని అల్యూమినియం ఫ్రేమ్ వర్గం మరియు కాంక్రీట్ గోడలతో కేవలం 15 రోజులలో 400 ఎస్ ఎఫ్ టి ఇంటిని నిర్మించింది.
వేదాన్ ఇన్ఫ్రాటేక్ స్టార్ట్ అప్ కంపెనీ ఎటువంటి సిమెంట్ ఇటుకల అవసరం లేకుండానే కేవలం 5 లక్షల బడ్జెట్లో ఈ మోడల్ హౌస్ నిర్మించింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ప్రతి ఒక్కరు వినే ఉంటారు. పెళ్లి చేయడం అలాగే ఇల్లు నిర్మించడం ఈ రెండు కూడా చాలా కష్టమైన పనులు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి కూడా చాలా శ్రమ, సమయం మరియు ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతాయి. ఈ మధ్యకాలంలో ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అనుకున్న బడ్జెట్లో ఇంటిని నిర్మించడం చాలా మందికి సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఇటీవల సిమెంట్, ఇటుకలు మరియు ఇనుము వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసింది. చాలామంది లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తి అవుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వేదాన్ ఇన్ఫ్రాటెక్ స్టార్ట్ అప్ కంపెనీ కేవలం ఐదు లక్షల రూపాయలతోనే ఒక అద్భుతమైన ఇల్లును నిర్మించింది. ఈ కంపెనీ ఆరుగురు కార్మికులతో 15 రోజుల తక్కువ సమయంలోనే 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి చూపించింది.