ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్.

కేంద్ర ప్రభుత్వం సంచలన నర్ణయం.

ఊపిరి పీల్చుకున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సిద్ధమవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో  మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆర్మీ బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. కర్రెగుట్టను జల్లెడ పడుతున్న CRPF బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. సుమారు 5వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తుంది.తెలంగాణ సరిహద్దులోని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని CRPF కోబ్రా జవాన్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్-పాక్ వార్ నేపథ్యంలో కర్రెగుట్టల నుండి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి రేపు ఉదయంలోపు భారత్- పాక్ సరిహద్దుల్లోకి సీఆర్‌పీఎఫ్ బలగాలు వెళ్లనున్నాయి.CRPF బలగాలు వెనక్కి వెళ్తుండడంతో ఏజెన్సీ గ్రామాలు రిలాక్స్ అయ్యాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram