రద్దయిన పాత నోట్ల కలకలం.. స్వాదీనం చేసుకున్న పోలీసులు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : రద్దయిన కరెన్సీ నోట్లను  మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ టివోలీ ఎక్స్‌ట్రీమ్‌ థియేటర్‌ సమీపంలో రద్దయిన పాత నోట్లు మార్చేందుకు యత్నిస్తున్నారని బేగంపేట పోలీసులకు సమాచారం అందించింది.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహబూబ్‌నగర్‌ జిల్లా వేపూర్‌ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్‌రెడ్డి, గొల్లమందల రవిని అదుపులోకి తీసుకున్నారు. పాత కరెన్సీ నోట్ల మార్పిడికి 20 శాతం కమిషన్‌ ఆధారంగా మరో వ్యక్తుల సహకారంతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు నిందితులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram