గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భారీ వృక్షం కూలి రోడ్డుపై అడ్డంగా పడిన సంఘటన కనకగూడెం మండలం రేగళ్ల పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కరకగూడెం మండల పరిధిలోని మద్దెలగూడెం పాత గుంపు వద్ద రహదారి పక్కనున్న భారీ చింత వృక్షం నేలకొరిగి రోడ్డుపై అడ్డంగా పడింది. మంగళవారం మధ్యాహ్నం మండలంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలి రావడంతో భారీ వృక్షం ఒక్కసాగా రోడ్డుపైకి పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చెట్టు నేలకొరిగే సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై అడ్డంగా చెట్టు పడిపోవడంతో, రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Post Views: 33