గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం : పది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్. అశ్వాపురం సి ఐ అశోక్ కథనం ప్రకారం.. అశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పలువురు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాము అక్కడికి చేరుకొని దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతూ పదిమంది వ్యక్తులు దొరికారని పట్టుబడిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సిఐ జి అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడిపందాలు పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని ఎవరైనా సమాచారం అందించినట్లయితే వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 8712682093 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల రూపాయలు 9 సెల్ ఫోన్లు స్వాధీనం. చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 38