చదువుతో పాటు సంస్కారం ముఖ్యం ..

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : పిల్లలకు చదువు సంస్కారంతో పాటు మంచిని, మానవ విలువలను తల్లిదండ్రులు నేర్పించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ముస్లిం స్త్రీ, పురుషులు తప్పనిసరిగా జ్ఞానాన్ని ఆర్జించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపార‌న్నారు. చదువు అంటే డిగ్రీ పట్టా, మార్కుల పత్రం కాదని, చదువు  సంస్కారం, తో పాటు ఉత్తమ నైతిక విలువలు కలిగిన మంచి మనిషిగా జీవించే మార్గం చూపాలన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram