చెరువుకు మరమ్మతులు చేయరూ.!

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామపంచాయతీ చిర్రకుంట చెరువు గత సంవత్సరం కురిసిన వర్షాలకు తూములు,అలుగు దెబ్బతిని. తూముల దగ్గర అమర్చిన షట్టర్లు  కూడా తుప్పు పట్టి నీరు వృధాగా పోతుంది. చెరువు క్రింద ఆయకట్టు రైతులు పంటలను  పండించి పంట చేతికందే సమయానికి చెరువులో నీరు లేక పంటలు ఎండిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడం పోతున్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధికారులు వేసవిలోనే చెరువు పై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. గత సంవత్సరం 2024 మే నెలలో కొంగల చెరువు తూములను ఆయకట్టు రైతులు రూ .45  వేలు చందాలు వేసుకొని సొంత డబ్బులతో మరమ్మత్తులు చేసుకోవడం జరిగింది. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించి బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగిందని. కానీ ఇంతవరకు ఇవ్వలేదని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైన రాయన పేటలోనిచిర్రకుంట చెరువుకు మరమ్మతులు చేయాలని. రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పినపాక నియోజకవర్గ నాయకులు చందా మధు. రైతులు కొమరం ఎర్రయ్య, పగడయ్య, మల్లయ్య, రాములు, లక్ష్మీ నరసయ్య, పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram