గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట: నకిలీ డాక్టర్లపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేసి వారి అక్రమ ఆస్తులను జప్తి చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి ప్రధాన కార్యదర్శి భయ్యా మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లో నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసేంతవరకు సంబంధిత అధికారులు డాక్టర్ల స్కానింగ్ సెంటర్ల స్కామ్ పై చర్యలు తీసుకోకపోవడంపై అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడి చర్యలు చేపడితే తప్ప అధికారులు పట్టించుకోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తన్నీరు యాదగిరి ,భగవాన్ కన్నా, జనార్ధన్, సట్టు వెంకన్న, కిషన్ నాయక్, రవీందర్ నాయక్, ధ్రువ కాంత్ యాదవ్,విజయ్, కమలాకర్ రావు,చిరంజీవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17