మాదకద్రవ్యాలు నియంత్రించడంలో 138 దేశాలతో పోటీపడ్డ తెలంగాణ పోలీస్ .
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కలిశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇటీవల ఎక్సలెన్స్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును సీవీ ఆనంద్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సీఎంను సీవీ ఆనందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పోలీసులను అభినందించారు.
దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సీపీ ఈ బహుమతి అందుకున్నాను. ఈ సందర్భంగా కమిషనర్ ను ముఖ్యమంత్రి గారు అభినందించారు.