గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ : ఎన్నికల హామీల అమల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ, రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నారు. దీని ద్వారా రోజుకు 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రెండు నెలల్లోగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Post Views: 58