బూర్గంపాడు గురుకుల పాఠశాల సమస్యల పై స్పందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ప్రధానంగా మంచినీటితో పాటు పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గురుకుల చుట్టు ప్రక్కల మునగ మొక్కలతో పాటు పలు మొక్కలు నాటాలి అని ఆదేశించారు. ఇంకుడుగుంతలను పరిశీలించి పలు ఇంకుడు గుంతలు నిర్మించాలి అని సూచించారు. సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసి,ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు భద్రత్ర పెంచాలి అని సూచించారు.పలు నిర్మాణాల కట్టాడాలు చేయాలి అని పాఠశాలల ప్రారంభ సమయానికి పనులు పూర్తి కావాలని ఐటీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,వారి సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.