ఘోర రోడ్డు ప్రమాదం.నలుగురు మృతి.. 20 మందికిపైగా తీవ్రగాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
గోల్డెన్ న్యూస్ /పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి ఆసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతగా గుర్తింపు
Post Views: 42