ఆస్పత్రి సిబ్బందితో ఎమ్మెల్యే, కలెక్టర్ – రివ్యూ మీటింగ్ నిర్వహణ .
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పినపాక శాసనసభ్యు లు పాయం వెంకటేశ్వర్లు తో కలిసి కలెక్టర్ జితేష్ వి పాటేల్ సందర్శించారు. ఆసుపత్రి వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యులు, సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించా అన్నారు.రోజువారీ OP సంఖ్య 500కి పైగా పెరగడం గమనార్హమని పేర్కొన్నారు.ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరిగిందన్నారు.57 మంది గర్భిణీ స్త్రీలు సాధారణ కాన్పు చేసి తల్లి-బిడ్డల్ని క్షేమంగా ఉండడంపై సిబ్బందిని అభినందించారు. ఈ విషయం ఆసుపత్రికి మంచి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు.
శానిటేషన్ కార్మికులు ఆసుపత్రిని తమ తమ ఇంటిల చూసుకోవాలని, ప్రతిక్షణం శుభ్రత పాటించాలని సూచించారు. హాస్పటల్ సిబ్బంది పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడి, శ్రద్ధగా వ్యవహరించాలన్నారు.అత్యవసర కేసులలో నిర్లక్ష్యం వహించ కూడదన్నారు .హాస్పిటల్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు తక్షణమే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెలిపారు. వాటి పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఎస్. రవి బాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సునీల్.మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీకినారి నవీన్,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సైదులు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి,ఇతర యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.