గోల్డెన్ న్యూస్ /పినపాక : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయినిఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యంతర శిక్షణలో భాగంగా పినపాక, కరకగూడెం మండలాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా కార్యక్రమంను పినపాక కరకగూడెం ఉమ్మమడిి మండలాల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయం- పినపాక బాలికల పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాాలు మంగళవారం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 1వ నుండి 5వ తరగతుల వరకు All సబ్జెక్ట్స్ ( తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం ) విద్యార్థులకు సామర్ధ్యాల పెంపుదల, సాంకేతిక సహకారంతో బోధన ( AI-ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ), ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపుదల, విద్యార్దులకు కనీస అభ్యాసన సామర్ధ్యాలను తరగతి వారీగా సాధించడం కోసం , సాధనలో ఉన్నటువంటి లోపాలను సవరించడం కోసం ఈ 5రోజుల
వృత్యంతర శిక్షణ కార్యక్రమం ను ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పినపాక మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య గారు, కరకగూడెం మండల విద్యాశాఖ అధికారి జి మంజుల మేడం గారు మరియు మండల రిసోర్స్ పర్సన్స్,(MRP’s)గా……
తెలుగు వి శ్రీకాంత్ ఎం తిరుమలరావు,గణితం వెంకటేశ్వర్లు,కే నరేష్,ఇంగ్లీష్ ఎస్ నర్సింహరావు, డి భావ్ సింగ్,పరిసరాల విజ్ఞానం సూర్యనారాయణ, వై కృష్ణయ్య మరియు మండల కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ , క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ( CRP’s ), ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు