9 ఏండ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు నమోదు చేసిన ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ .
గోల్డెన్ న్యూస్ /వరంగల్ : జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 9 సంవత్సరాలు క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పై వరంగల్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. నగరం పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ భూమి వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా.. తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో 9 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించిననందుకు. మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలాా ఉండగా పోలీసుల వ్యవహారం చూస్తే.. ఆశ్చర్యమే కలుగుతోంది. కొన్నేళ్ల కిందట చనిపోయిన చనిపోయిన వ్యక్తిిపై పోలీసులు భూకబ్జా నమోదు చేయడం పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.