సమ్మక్క సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న తెదేపా నాయకులు

అమ్మవార్లకు మొక్కు చెల్లించుకున్న ఇనపాక నియోజకవర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు .

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అప్పటి వైసిపి ప్రభుత్వం టిడిపి జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అరెస్టు చేసినప్పుడు  చంద్రబాబు క్షేమంగా ఉండాలని, జైలు నుండి క్షేమంగా బయటకు రావాలని అప్పుడు ఎన్నో దేవి దేవతల వద్ద,పూజలు నిర్వహించారు. అందులో ములుగు జిల్లా రంగాపూర్, గ్రామం ప్రక్కన వీరాపురం గ్రామంలో వెలసియున్న సమ్మక్క సారలమ్మ గుడి వద్ద కూడా మొక్కుకోవడం  జరిగింది. పినపాక నియోజకవర్గ నాయకురాలు తాతా మాధవి లత ఆధ్వర్యంలో బుధవారం ఆ మొక్కను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చందా మధు, పసునూరి సీతమ్మ, పురిటి విజయలక్ష్మి, వీరయ్య, రాధాకృష్ణ, మేదరమెట్ల శ్రీనివాసరావు ,సంఘ సుబ్బారెడ్డి ,ధర్మరాజుల శంకర్ ,నాగేశ్వరరావు, లలిత, జయ ,భవాని తదితరులు పాల్గొని మొక్కు చెల్లించుకొని తెలుగుదేశం పూర్వ వైభవం వచ్చేందుకు అమ్మవర్ల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram