నేలపై 14 సెకండ్ల పాటు వెలిగిన పిడుగు

గోల్డెన్ న్యూస్/  మంచిర్యాల :  జన్నారం మండలకేంద్రంలోని శ్రీలంక కాలనీలో బుధవారం సాయంత్రం వింత దృశ్యం చోటుచేసుకుంది. ఒక ఖాళీ స్థలంలో పిడుగు పడింది. ఆ పిడుగు సుమారు 14 నుంచి 15 సెకండ్ల  పాటు కరెంట్ బల్బులా వెలుగుతూ ఉండడంతో సానికులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు.

సాధారణంగా పిడుగులు క్షణాల్లో పడిపోతుంటాయి. కానీ అక్కడ భూమిపై పడిన పిడుగు  సుదీర్ఘంగా కనిపించడమే కాక, ఆకాశం నుంచి భూమిని తాకే వరకు ఒక వెలుగుతూ తీగల నిలిచిపోయింది. ఇది ప్రత్యక్షంగా చూసిన వారు ఈ ఘటనను అసాధారణ దృశ్యంగా పేర్కొంటున్నారు.

 

స్థానికుల కథనం మేరకు, పిడుగు పడిన సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తూ భూమిని తాకిందని భూమిపై చెప్పారు. ఇదంతా 14 సెకండ్ల పాటు కొనసాగిందని, అది పూర్తయ్యే వరకు అంతా ఆశ్చర్యాన్ని గురైనట్లు  తెలిపారు. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని, ఆస్తి నష్టం జరగాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram