సూర్యాపేటలో వైద్య రంగంలో ప్రక్షాళన జరగాలి
నకిలీ డాక్టర్ లపై చర్యలు తీసుకోవాలి .
చర్చా వేదిక లో వక్తల డిమాండ్..
గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్య రంగంలో ప్రక్షాళన జరగాలని, నకిలీ డాక్టర్ లపై చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలో సూర్యాపేట వైద్య రంగానికి ఏ రోగం వచ్చింది.చర్చా వేదిక జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు,ఐఎంఏ సభ్యులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు,ప్రజా సంఘాలు పాల్గొని మాట్లాడారు.పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ఆపిల్ స్కానింగ్ సెంటర్ ల పై తనిఖీలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని అన్నారు.పేద అమాయక ప్రజలే లక్ష్యం గా నకిలీ డాక్టర్ లు, అర్హత లేని రేడియాలజిస్ట్ లతో స్కానింగ్ సెంటర్ లు నిర్వహించడం ఈ తతంగం అంతా ఆలస్యంగా వెలుగు లోకి రావడం నకిలీ డాక్టర్ లతో నిర్వహిస్తున్న ఆస్పత్రులను, ఆపిల్ స్కానింగ్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీజ్ చేయడం ప్రజల చైతన్యం ఫలితమే నని అభిప్రాయ పడ్డారు.ఇప్పటి వరకు అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా పలు ఆస్పత్రులను మెడికల్ మాఫియా డబ్బులు సంపాదనే ధ్యేయంగా నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని ఇక వారి ఆటలు సాగవని తెలిపారు.తెలంగాణ మెడికల్ కౌన్సిల్,ఐఎంఏ అనుమతి లేకుండా నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్ట్ లు,ప్రజా సంఘాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు,ఏఎంఏ పోరాటం, నకిలీ ల ఉదంతం బాగోతాలను బహిర్గతం చేయడం తోనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పై బదిలీ వేటు పడటం హర్షణీయమని చెప్పారు.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు నకిలీ డాక్టర్ లతో ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నుంచి నకిలీ డాక్టర్ ల బెడద లేకుండా పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజా చైతన్యం దిశగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇదే విధానాన్ని కొనసాగించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక సూర్యాపేట ప్రతినిధులు కుంట్ల ధర్మార్జున్,తండు నాగరాజు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ రాజీవ్, ఐఎంఏ అధ్యక్షులు ఆనంద్ దాండ్గే, సీనియర్ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, సైకియాట్రిస్ట్ వైద్యులు డాక్టర్ శిరీష, కార్యదర్శి రమేష్ నాయక్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఐతబోయిన రాంబాబు,బంటు కృష్ణ, రాపర్తి మహేష్, ఉయ్యాల నరసయ్య, మల్లికార్జున్, దుర్గం, బాలు, తండు వెంకటేష్ గౌడ్, రెడ్డి బిక్షం రూథర్, మామిడి శంకర్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మ గాని వినయ్, సూర్యాపేట పూర్వ మిత్ర మండలి అధ్యక్షులు బయ్య మల్లికార్జున్, సిపిఎం న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షులు మండారి డేవిడ్ కుమార్, డిటిఎఫ్ జిల్లా నాయకులు రేపాక లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు నవిలే ఉపేందర్, ముద్ద బిక్షపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.