ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

తరగతి గదిలోనే  దేశ అభివృద్ధి ఎమ్మెల్యే పాయం

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం: విద్యావిభాగం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కొనసాగుతున్న పినపాక, కరకగూడెం మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత ఉంటుందని, ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా బోధిస్తూ వారిలో నైపుణ్యాలు పెంపొందించాలని  పేర్కొన్నారు.  శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించాలన్నారు. ఎమ్మెల్యే  కోరారు. విద్యా అభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మెరుగైన బాటలు వేయాలన్నారు. దేశ అభివృద్ధి జరగాలంటే విద్యతోనే సాధ్యమని తెలియజేశారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉత్తమంగా అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ, ఎంఈఓ, కరకగూడెం, పినపాక మండల ఉపాధ్యాయులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram