టేకులపల్లి పరిధిలో 698 కిలోల గంజాయి పటివేత

గోల్డెన్ న్యూస్ /టేకులపల్లి :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని ముత్యాలంపాడు సమీపంలో శనివారం అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు  టేకులపల్లి పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు X రోడ్ సమీపంలో గల A.C.A సులానగర్ మినిస్ట్రీ చర్చ్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఎస్కార్ట్ వస్తున్న కారు నెంబర్ HR05BK6032,  HR637315  నంబరు గల ఐచర్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా 698 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని పట్టుబడింది. పట్టుబడిన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి విలువ సుమారుగా రూ.3,49 కోట్లు వరకు ఉంటుందని తెలిపారు. ఐచర్ వ్యానులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను మొత్తం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ విచారిస్తున్నట్లు తెలిపారు.

గంజాయి అమ్మకానికి పాల్పడినవారు, కొనుగోలు చేసినవారు, రవాణాలో భాగమైనవారిపై కేసులు నమోదు చేశారు. ఐచర్ మరియు కారు ను మరియు 5 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసినట్లుతెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు అటవీ ప్రాంతం నుండి హర్యానా రాష్ట్రం,కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా ఇట్టి గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులందరూ కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున ఇట్టి గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు.విచారణ పూర్తి అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. భారీస్థాయిలో గంజాయి పట్టుబడడం పోలీసు శాఖ ప్రమాదం అయింది. అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రవాణా ముఠాలు జిల్లాలో కార్యకలాపాలు జరుపుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram