పెళ్లి పీటల మీద వరుడికి ఊహించని షాక్ ఇచ్చన వధువు..

పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని పెళ్లి వీడియోలు ఫన్నీగా ఉంటే..మరికొన్ని షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటాయి. మరీ పెళ్లిళ్లలొ కొంత మంది కావాలని చేస్తారో.. పబ్లిసిటీ కోసం స్టంట్లు చేస్తారో కానీ.. పెళ్లిలో జరిగే వెరైటీ ఘటనలతో ఆ వెడ్డింగ్ ట్రెండింగ్ గా మారుతుంటాయి.

 

పెళ్లిలో మాజీ లవర్స్ ఎంట్రీ ఇవ్వడం, వధువు గొడవలు పెట్టుకున్న వీడియోలు చూశాం. మరికొన్ని పెళ్లిళ్లలో కాబోయే భర్తకు ఇంగ్లీష్ రాదని, పీటల మీదకు తాగి వచ్చాడని కొత్త పెళ్లికూతురు పెళ్లిని క్యాన్షిల్ చేసుకుని వెళ్లిపోయిన ఘటనలను చూశాం. ఇంకా కొన్ని చోట్ల.. వరకట్నం గొడవలతో వెడ్డింగ్ లు ఆగిపోయిన ఘటనలు కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

 

కానీ.. తాజాగా.. కర్ణాటకలోని హసన్ లో పెళ్లిలో చోటుచేసుకున్న ఒక ఘటన గుండెల్ని పిండేసేదిగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కర్ణాటకలోని హసన్ లో చుంచనగిరి కళ్యాణ మండపంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. కళ్యాణ మండపం అంతా అతిథులతో కళకళలాడుతుంది. పీటల మీద కొత్త జంటలతో పండితుడు మంగళ సూత్రం కట్టించే కార్యక్రమం జరుగుతుంది.

 

పందిట్లో భారీగా బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుడు మంగళసూత్రంను తీసుకుని వధువు మెడలో కట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇంతలో వధువు… వరుడ్ని చూస్తు గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో వరుడు షాక్ అయ్యాడు. తనకు ఈ పెళ్లి ఇష్టలేదని, తన ప్రియుడ్ని మర్చిపోలేకపోతున్నట్లు చెప్పింది. తన ప్రియుడు పెళ్లికి వస్తున్నాడని కూడా చెప్పింది.

 

దీంతో చేసేదిలేక.. వరుడు పెళ్లిని క్యాన్షిల్ చేసుకుని వెళ్లిపోయాడు. నవవధువు ఆమె ప్రియుడు రావడంతో.. స్టేజీ మీద నుంచి దిగిపోయింది. నేరుగా కారు ఎక్కేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు వధువు ధైర్యానికి మెచ్చుకొవాల్సిందే నంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కొంత మంది.. బ్రో నువ్వు బతికిపోయావ్.. అంటూ అతనికి ధైర్యం చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Facebook
WhatsApp
Twitter
Telegram