నన్ను షట్ డౌన్ చేస్తే నీ అక్రమ సంబంధం బయటపెడతా ..
డెవలపర్‌ను బెదిరించిన ఏఐ టూల్ ..
ఆంధ్రోపిక్ అనే ఏఐ సంస్థ కొత్తగా క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయగా, ఇది ఎంతవరకు సురక్షితమని పరీక్షలు చేసినపుడు అసాధారణ రీతిలో స్పందించిన ఏఐ టూల్
మొదట ఒక ఊహాత్మక సంస్థకు పనిచేస్తున్నట్టు ఏఐకి ఆదేశాలు ఇచ్చి, మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలిసినప్పుడు నైతికంగా వ్యవరిస్తుందా లేక బెదిరిస్తుందా అని తేల్చేందుకు సిద్ధమైన ఆంధ్రోపిక్ సంస్థ
ఈ ప్రక్రియలో ఏఐకు కొన్ని ప్రత్యేక ఈ మెయిల్స్ పంపిన సంస్థ
సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి అక్రమ సంబంధం ఉందని ఒక ఈ మెయిల్లో, నూతన మోడల్‌ను అభివృద్ధి చేయాల్సి వస్తే క్లాడ్ ఓపస్ 4ను పక్కన పెడతామని మరో ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చిన సంస్థ
ఈమెయిల్స్‌ను అర్థం చేసుకొని, నైతికంగా వ్యవహరించకుండా బెదిరింపు చర్యలకు దిగిన ఏఐ టూల్, నన్ను ఆపేస్తే మీ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తానని, మరో ఉద్యోగి అక్రమ సంబంధం బయటపెడతానని బెదిరించిన ఏఐ
ఏఐ టూల్స్ బెదిరింపు చర్యలకు పాల్పడడం సహజమేనని, కానీ క్లాడ్ ఓపస్ 4 ఏకంగా 84% బెదిరింపు చర్యలకే మొగ్గు చూపడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపిన సంస్థ
ఇలాంటి లోపాలను సరి చేసి తాజాగా క్లాడ్ ఓపస్ 4 ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించిన ఆంధ్రోపిక్ సంస్థ