త్వరలో రానున్న ఉత్తర్వులు.
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం. తీపికబురు చెప్పింది. అంగన్వాడి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా వరాల జల్లు కురిపించింది. అంగన్వాడీ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదవీ విరమణ పొందే ప్రతి అంగన్వాడీ టీచర్కు రూ.2 లక్షలు, అదేవిధంగా హెల్పర్కు రూ.1 లక్ష వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకట చేయనున్నట్లుగా తెలుస్తోంది.
Post Views: 58