ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మోతే మండలం లో ఈరోజు తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది, సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో నడిరోడ్డుపై ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.

 

ప్రవేట్ ట్రావెల్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్.. బస్సులోంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.

 

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram