ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి : ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మండలంలోని చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే వ్యక్తి, దరఖాస్తు చేసుకున్నా కూడా తనకు ఇల్లు మంజూరు చేయలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పి, తరువాత ఇల్లు రాలేదని చెప్పడంతో అశోక్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని తెలిపిన గ్రామస్తులు
అశోక్ మృతికి ప్రభుత్వమే కారణమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామపంచాయితీ ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగిన గ్రామస్తులు
అశోక్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, అతని కుటుంబానికి ఎకరం భూమి, కుమార్తెలకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు
Post Views: 48