నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి
ముడి పదార్థాల రవాణాపై పటిష్ట నిఘా –
♦ 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలోని చెప్పాలా పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై శుక్రవారం మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలన ప్రత్యేక కార్యక్రమం లో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 వందల లీటర్ల బెల్లం ఆకంతోపాటు రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేసిన అమ్మిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా ఇతర జిల్లాల నుంచి కొందరు మండలా నికి బెల్లం, పటిక సరఫరా తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.